'డీఏను వెంటనే విడుదల చేయాలి'
KDP: కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ BSNLలో పనిచేస్తున్న పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి నుంచి డీఏ విడుదల చేయలేదని వెంటనే మంజూరు చేయాలని AIBDPA జిల్లా కార్యదర్శి కళ్యా సుధాకర్ డిమాండ్ చేశారు. ఇవాళ టెలికం డిపార్ట్‌మెంట్ జీఎం కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. BSNL లాభనష్టాలతో పెన్షనర్లకు సంబంధం ఉండదన్నారు.