మోదీపై మరోసారి శశిథరూర్ ప్రశంసలు

మోదీపై మరోసారి శశిథరూర్ ప్రశంసలు

ప్రధాని మోదీని మరోసారి కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసించారు. ప్రజల సమస్యల విషయంలో ప్రధాని ఎప్పుడూ ఎమోషనల్ మోడ్‌లో ఉంటారని కొనియాడారు. వలసవాద ఆలోచన విధానం నుంచి బయటపడాలంటే భారతదేశ వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని మోదీ చెబుతుంటారని కితాబిచ్చారు. మోదీతో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.