స్వాతంత్య్ర సమరయోధులకు ఘనసత్కారం

స్వాతంత్య్ర సమరయోధులకు ఘనసత్కారం

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులను మహబూబ్‌నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసిన వారిని సత్కరించుకోవడం మన ధర్మం అని వెల్లడించారు.