ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం.. కోతకు గురైన రోడ్లు

KKD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై తుపాను ప్రభావంతో సముద్ర తీరంలో అలలు ఎక్కువ వేగంతో ఎగిసి పడుతున్నాయి. సముద్రంలో రాకాసి అలలు, వేగవంతమైన కెరటాలు గ్రామాలపై దూసుకొచ్చాయి. తీరప్రాంత గ్రామాలు కోతకు గురయ్యాయి. ఉప్పాడ-కాకినాడ రహదారి ధ్వంసమై, భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది.