తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం: సీఐ

తెలంగాణ నుంచి తరలిస్తున్న మద్యం స్వాధీనం: సీఐ

KRNL: పంచలింగాలలో తెలంగాణ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కర్నూల్ ఎక్సైజ్ సీఐ చంద్రహాస్ తెలిపారు. పంచలింగాల వద్ద గురువారం వాహనాల తనిఖీ సందర్భంగా తెలంగాణ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నామన్నారు. ఫరూక్ అహ్మద్ బైక్ పై 180 ఎంఎల్ బాటిళ్లు రవాణా చేస్తూ పట్టుబడ్డాడన్నారు. మద్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేశామని ఆయన పేర్కొన్నారు.