పురుగుల మందు డబ్బాలతో రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు పురుగుల మందు డబ్బాలతో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎండిపోతున్న తమ పంట పొలాలకు సాగునీరు అందించి ఆదుకోవాలని, పంటలు చేతికొచ్చినా సరిపడా నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పురుగుల మందు డబ్బాలను గమనించిన పోలీసులు రైతులను అడ్డుకున్నారు.