శిక్షణలో ప్రతిభ చూపిన కానిస్టేబుల్ ప్రశాంత్
మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రశాంత్ శిక్షణలో ప్రతిభ చూపడంతో జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. మొహీనాబాద్‌లో ఐఐటీఏ శిక్షణకు రాష్ట్రం నుంచి 51 మంది హాజరయ్యారు. మెదక్ జిల్లా నుంచి ప్రశాంత్, రాకేష్, ప్రదీప్ హాజరు కాగా ప్రశాంత్ ఫైరింగ్, పీపీటీ విభాగాలలో ప్రతిభ చూపి మెడల్ సాధించారు. జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ మహేందర్ అభినందించారు.