ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KDP : చాపాడు మండలం బద్రిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.