చిన్నకోడూరులో 84.84% పోలింగ్
SDPT: చిన్నకోడూరు మండలంలో రెండో విడత స్థానిక ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశాజనకంగా నమోదైంది. ఎన్నికలు ముగిసే సమయానికి 84.84% ఓటింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మండలంలో మొత్తం 32,948 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో గంటలో ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో గ్రామాల వారీగా సర్పంచ్ అభ్యర్థులు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.