VIDEO: టీడీపీ నాయకులు నన్ను చంపాలని చూశారు: వైసీపీ నేత

VZM: వంగర మండలం YCP నేత కరణం సుదర్శనరావుపై శుక్రవారం రాత్రి హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి ఘటనను బాధితుడు సుదర్శనరావు వివరించారు. నారంనాయుడువలస సమీపంలో ఆరుగురు టీడీపీ సానుభూతిపరులు బైక్ అడ్డుగా పెట్టి తనను, డ్రైవర్‌ను చంపాలని చూశారన్నారు. కారును ధ్వంసం చేశారని, భవిష్యత్‌లో తనను చంపడానికి వెనుకంజ వేయరని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.