NSS, NCC విద్యార్థుల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ప్రిన్సిపాల్

NSS, NCC విద్యార్థుల ఆధ్వర్యంలో మొక్కలు నాటిన ప్రిన్సిపాల్

WGL: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్క నాటాలని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.మల్లం నవీన్ అన్నారు. కళాశాల ఆవరణలో NSS, NCC విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం 'స్వచ్ఛభారత్- స్వచ్ఛ కళాశాల' కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కళాశాలలోని పిచ్చి మొక్కలను విద్యార్థులు తొలగించారు.