చర్లపల్లి జైలులో ఆయుర్వేదిక్ విలేజ్ యూనిట్ల ప్రారంభం
MDCL: చర్లపల్లి జైలులో ఖైదీల పునరావాసం దిశగా మరో వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. జైలు వ్యవసాయ క్షేత్రంలో ఆయుర్వేదిక్ విలేజ్ యూనిట్లను ప్రారంభించినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. ఈ యూనిట్ల ద్వారా ఖైదీలకు ఉపాధి నైపుణ్యాలు పెంపొందించి, విడుదల తర్వాత స్వయం ఉపాధికి మార్గం సుగమం చేయడం లక్ష్యంగా ఉందన్నారు.