విందు, శుభకార్యాల్లో మారుతున్న మెనూ!

విందు, శుభకార్యాల్లో మారుతున్న మెనూ!

సాధారణంగా వివాహాలు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు బిర్యానీలు, మాంసం, శాకాహారం, తీపి వంటకాలే దర్శనమిస్తాయి. అయితే, పలు పట్టణాల్లో వంటకాల మెనూ మారుతోంది. ఉన్నత వర్గాల వారు పెళ్లిళ్లు, విందుల్లో జొన్నరొట్టెలు, కొర్రబువ్వ, తైదరొట్టెలు, తైద అంబలి, రాగిలడ్డు, పల్లిపొడి, అవిశపొడి, గడ్డి నువ్వుల లాంటి వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అతిథులు సైతం వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తున్నారు.