అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

MDK: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరిక మేరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల బాయ్స్ హాస్టల్, ప్రభుత్వ జూనియర్ గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజీల్లో వరదనీరు చేరిన పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.