'తడిసిన ఒడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలి'

SRPT: తడిసిన ఒడ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, ఐకెపి సెంటర్లు ఓపెన్ చేసి రైతులకు న్యాయం చేయాలని మునగాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మునగాలలో రాత్రి కురిసిన వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని సోమవారం వారు పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కె.సత్యనారాయణ, ఉడుం కృష్ణ, ఎల్పి రామయ్య, గడ్డం లింగయ్య, నాగబాబు, అప్పారావు ఉన్నారు.