పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ వాయిదా

పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ వాయిదా

హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లో ఇవాళ జరగాల్సిన డిఫెన్స్ మాక్ డ్రిల్ వాయిదా పడింది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో నిర్వహించాల్సిన మాక్ డ్రిల్‌ను కేంద్ర హోంశాఖ ఆదేశాలతో వాయిదా వేసినట్లు హర్యానా తెలిపింది. పరిపాలనా కారణాలతో ఈ డ్రిల్‌ను వాయిదా వేసినట్లు చెప్పిన రాజస్థాన్.. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. జూన్ 3న నిర్వహిస్తామని పంజాబ్ వెల్లడించింది.