రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై వ్యాసరచన పోటీలు
VKB: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రోడ్డు భద్రత నివారణలో భాగంగా బుధవారం దోమ మండలం బొంపల్లి ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు దోమ ఎస్సై వసంత్ జాదవ్ బహుమతులు అందజేశారు. ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే ట్రాఫిక్ రూల్స్, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.