36 చోట్ల పాక్ దాడులకు యత్నం: ఖురేషి

పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో పాక్ దాడులకు పాల్పడినట్లు కల్నల్ ఖురేషి వెల్లడించారు. లేహ్ నుంచి సర్‌క్రీక్ వరకు 36 చోట్ల దాడులకు పాల్పడిందని చెప్పారు. కైనటిక్, నాన్ కైనటిక్ సాధనాలతో భారత్ తిప్పికొట్టిందని స్పష్టంచేశారు. డ్రోన్ల శిథిలాల పరిశీలన జరుగుతోందని.. ఆ డ్రోన్లు టర్కీకి చెందినవిగా తెలుస్తోందని పేర్కొన్నారు. బటిండా సైనిక స్థావరంపై కూడా దాడికి యత్నించిందని తెలిపారు.