విద్యార్థులకు బహుమతులను అందజేసిన కలెక్టర్
SKLM: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బహుమతులు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయిలో బహుమతులు పొందిన వారిని అభినందించారు. ప్రథమ స్థానంలో బహుమతులు పొందిన దృశ్యాలను వీడియోకాన్ఫరెన్స్‌లో వీక్షించారు.