CMRF చెక్కులు పంచిన ఎమ్మెల్యే కనకయ్య
MHBD: అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఒక వరంలా మారిందని ఇల్లందు MLA కోరం కనకయ్య అన్నారు. బయ్యారం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన పలువురు CMRF లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 42 మందికి 13,58,000 విలువైన చెక్కులను అందచేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగపర్చుకోవాలన్నారు.