బహ్రెయిన్ రాజుకు మోదీ ఫోన్
పశ్చిమాసియాలో ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. మధ్యప్రాచ్ఛంలోని తాజా పరిణామాలపై బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగేలా పశ్చిమాసియ దేశాలు చొరవ తీసుకోవాలని సూచించారు.