VIDEO: యూరియా vs నానో యూరియా వివాదం

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం వచ్చిన రైతులకు నానో యూరియా తీసుకోవాలని ఎరువుల సరఫరా నిర్వాహకులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైతులు యూరియా బస్తాలు కావాలని, నానో యూరియా బాటిళ్లు వద్దని శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.