22న తిరుపతి నుండి విశాఖపట్నం వరకు రథయాత్ర

CTR: శ్రీ ఆదివరాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు శ్రీవారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందు వరాహి ఆలయ వ్యవస్థాపకులు మహారుద్రస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.