రేపు కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన

NDL: రేపు కొలిమిగుండ్లలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు కోటపాడు శివరామిరెడ్డి తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగే పేరెంట్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మండలంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.