మేడ్చల్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

మేడ్చల్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

మేడ్చల్: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని లారీ ఢీకొనడంతో మృతి చెందాడని స్థానికులు చెబుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.