భద్రత కోసమే గణేష్ ఆన్లైన్ నమోదు: సీఐ

KMR: ప్రజల భద్రత, బందోబస్తు కోసమే గణేష్ మండపాల ఆన్‌లైన్ నమోదు విధానం నేడు ప్రారంభించినట్టు KMR పట్టణ CI నరహరి తెలిపారు. మండప నిర్వాహకులు పోలీస్ శాఖ రూపొందించిన http://policeportal.tspolice.gov.in సైట్‌లో వివరాలు నమోదు చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండపాల ఏర్పాటు ప్రజా రవాణాకు, అత్యవసర వాహనాలకు ఇబ్బంది కలిగించకూడదని సూచించారు.