గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి: అరకు ఎమ్మెల్యే
ASR: గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం వైద్యులు, సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన విశాఖ కేజీహెచ్ సందర్శించారు. చికిత్స పొందుతున్న గిరిజన రోగులను పరామర్శించి వారి ఆరోగ్యం గురించి, అక్కడ అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేజీహెచ్‌లో ఎస్టీ సెల్ తనిఖీ చేశారు. గిరిజనులకు సహాయం అందించాలన్నారు.