VIDEO: డ్రైవర్‌కు ఫిట్స్.. ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్
MBNR: జడ్చర్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. ట్రాక్టరు నడుపుతుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆ సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనారోగ్య సమస్యలున్న వారు వాహనాలు నడపరాదని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.