రెస్టారెంట్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

AP: విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహా ఏమి రుచులు రెస్టారెంట్‌లో అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో కుళ్లిన చికెన్, బూజు పట్టిన మటన్‌ను గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని వేడి చేసి ఇస్తున్నారని అధికారులు తెలిపారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 85 కిలోల కుళ్లిన మాంసాన్ని అధికారులు పారబోశారు.