'నల్ల చట్టాలను నిరసిస్తూ బహిరంగ సభ'
SRD: పరిశ్రమలలో 8 గంటల పని దినాలు, కనీస వేతనం అమలు, కేంద్ర ప్రభుత్వ నూతన నల్ల చట్టాలను నిరసిస్తూ మెదక్‌లో 7న రాష్ట్రవ్యాప్త బహిరంగ సభ ఉన్నదని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు పాండురంగారెడ్డి తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో సీఐటీయు ఆధ్వర్యంలో 2కే రన్ సందర్భంగా మాట్లాడారు. మెదక్ పట్టణంలో 7, 8, 9 మూడు రోజులు CITU రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని అన్నారు.