31 మందికి మండల స్థాయి అధికారులుగా పదోన్నతి
ATP: పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గ్రేడ్-1గా ఉన్న 31 మందికి గ్రామ, వార్డు సచివాలయ ఆఫీసర్ మండల స్థాయి అధికారులుగా ఉద్యోగోన్నతి కల్పించి నట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు తెలిపారు. ప్రమోషన్ పొందిన వారికి త్వరలోనే మండలాలు కేటాయిస్తామన్నారు. పదోన్నతి పొందిన వారు మండలంలో గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు.