VIDEO: టీడీపీ ఎమ్మెల్యేపై రాజాసింగ్ ఫైర్
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు 'బుద్ధిలేని వ్యక్తి' అంటూ రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను టీటీడీ బోర్డులో నియమించడంపై మండిపడ్డారు. టీటీడీ సభ్యుల నియామకానికి ముందు వారికి హిందూ ధర్మంపై నమ్మకం, జ్ఞానం ఉందో లేదో చూడాలని CM చంద్రబాబుకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. రాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.