DANGER: లింకు నొక్కి LIKE కొడితే డబ్బులు మాయం..!

HYD: నగరం ప్రజలు సైబర్ మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. టెలిగ్రామ్ లింకుల్లో లింక్ నొక్కి, ప్రతిదానికి లైక్ కొడితే డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పే మాయమాటలు నమ్మొద్దన్నారు. అలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఒక లింకుతో కుషాయిగూడ ప్రాంతం పరిధిలో ఓ వ్యక్తి తాజాగా ఏకంగా ఇటీవల రూ.13 లక్షల 70వేలు పోగొట్టుకున్నారు.