పదిమంది రైతులకు రూ.6లక్షల రుణాలు

ASR: ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని హుకుంపేట పీఏసీఎస్ ఛైర్మన్ తాంగుల మోహన్ రైతులకు సూచించారు. శుక్రవారం మండలానికి చెందిన పదిమంది రైతులకు డైరెక్టర్లు సరస్వతి, దాసన్నతో కలిసి రూ.6లక్షల రుణాలను పంపిణీ చేశారు. రైతులు సాగులో ఆర్ధిక ఇబ్బందులు లేకుండా పెట్టుబడి అందించేందుకు రుణాలు పంపిణీ చేస్తున్నామన్నారు.