రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

రైఫిల్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

BDK: చర్ల సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్, ఒడిసా సరిహద్దుల్లో గల సోనాబేడా సమీపంలో ఉన్న దేకున్ పానీ సీఆర్పీఎఫ్ శిబిరంలో శనివారం ఒక జవాన్ ఏకే 47 రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిసా రాష్ట్రంలోని ఖర్దారా గ్రామానికి చెందిన గోపీనాథ్ సబర్‌గా అధికారులు గుర్తించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. అయితే ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.