13కి చేరిన మృతుల సంఖ్య

13కి చేరిన మృతుల సంఖ్య

మార్కాపురం జిల్లా రాయవరం రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. కాగా, మృతుల్లో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీరు కనిగిరి, పామూరుకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నట్లు సమాచారం. అయితే, మంటలు చెలరేగిన వెంటనే 10 మంది ప్రయాణికులు బస్సులో నుంచి బయటకు దూకినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం 5 గంటలకు జరిగింది.