'రాయితీ పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలి'
అన్నమయ్య: ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధి కోసం 50% సబ్సిడీతో పంపిణీ చేస్తున్న పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి చరిత అన్నారు. ఇందులో భాగంగా శనివారం వెలిగల్లు పశు వైద్య కేంద్రంలో తుస్సువారిపల్లె, నడిం బురుజు, కోటగుట్టపల్లె, బుసిరెడ్డిగారిపల్లె రైతులకు పశువుల దాణాను పంపిణీ చేశారు. ఈ మేరకు వెలిగల్లు పశు వైద్యశాలలో 10 టన్నుల ఫీడ్ అందుబాటులో ఉందన్నారు.