కార్యాలయంలో అధికారులు కరువు
RR: కేశంపేటలోని ప్రభుత్వ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. ఉదయం 10:30 దాటినా అధికారులు కార్యాలయానికి రాలేదని స్థానిక ప్రజలు తెలిపారు. సమస్యల పరిష్కారానికి అధికారులను సంప్రదించడానికి ప్రజలు వస్తే వారు కానరాక ఏమి చేయాలో తోచక కార్యాలయాల వద్ద ఉన్న చెట్ల కింద సేద తీరుతున్నారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.