భారీగా తగ్గిపోయిన పర్యాటకుల సంఖ్య
అల్లూరి: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. సోమవారం ఒక పర్యాటక బోటులో 45 మంది పర్యాటకులు మాత్రమే గోదావరి నదిలో విహారయాత్రకు వెళ్లినట్లు టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పర్యాటక ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.