'పిలవని వారికీ ఫంక్షన్ హాల్‌లో ప్రవేశం నిషేధం'

'పిలవని వారికీ ఫంక్షన్ హాల్‌లో ప్రవేశం నిషేధం'

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ ముందు యజమాని ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేకుండా కార్యక్రమాలకు వస్తే ఐపీసీ 441 సెక్షన్ కింద మూడు నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. ఆహ్వానం లేకుండా వచ్చే వారి వల్ల ఫంక్షన్ల గిరాకీ తగ్గుతోందని యజమాని బోర్డును ఏర్పాటు చేసినట్లు తెలిపాడు.