నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ అరెస్ట్

నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ అరెస్ట్

TG: HYDలో నేషనల్ హైవే అథారిటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ టోల్ ప్లాజా పక్కన రెస్టారెంట్ నడుపుతున్న వ్యక్తి నుంచి రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆయన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్ నడుపుతున్నారని బెదిరించి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.