కంది పంటకు పురుగు బెడద

కంది పంటకు పురుగు బెడద

KMR: మద్నూర్ మండలంలో కంది పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. అయితే నాలుగు రోజులుగా పంటకు పురుగు సోకి పూతకు నష్టం చేకూరుస్తోందని రైతులు వాపోయారు. పురుగు నివారణ కోసం క్రిమిసంహార మందులు పిచికారి చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటను పరిశీలించి సస్యరక్షణ చర్యలు గురించి వివరించాలని రైతులు కోరుతున్నారు.