నవంబర్ 4న YCP ప్రజా ఉద్యమం
VZM: మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి నివాసంలో సోమవారం వైసీపీ నాయకులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా నగర పార్టీ అధ్యక్షులు ఆశపు వేణు మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28న జరగనున్న YCP ప్రజా ఉద్యమం తుఫాన్ నేపథ్యంలో నవంబర్ 4వ తేదిన జరుపుటకు పార్టీ నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.