జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీమంత్రి

జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీమంత్రి

జాతీయ బీసీ కమిషన్ ఛైర్‌పర్సన్(NCBC)గా కేంద్ర మాజీమంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్రపతి భవన్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ పదవిలో నియమితులయ్యారు. ఇప్పటివరకు NCBC అధ్యక్షులుగా ఉన్న గంగారామ్ పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో జ్యోతిని నియమించారు. దేశవ్యాప్తంగా ఉన్న వెనకబడిన తరగతుల సంక్షేమం, వారి హక్కుల కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు.