'పెద్దింటి రచనలు.. మన అస్తిత్వ వేదనలు'

'పెద్దింటి రచనలు.. మన అస్తిత్వ వేదనలు'

SRCL: సిరిసిల్లకు చెందిన ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రాసిన మాయి ముంత, సావు డప్పు వంటివి కథలు మాత్రమే కావని, మన అస్థిత్వ వేదనలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి ఇటీవల రాసిన కథలు చదివానని.. అవి చాలా బాగున్నాయన్నారు. దీంతో అతన్ని X వేదికగా అభినందించారు.