గ్యార్మీ షరీఫ్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
BDK: కొత్తగూడెం పట్టణంలోని జమా మసీద్‌లో ముస్లింలు గ్యార్మీ షరీఫ్ వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మనందరిపై అల్లా చల్లని దీవెనలు ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.