'దేశభక్తిపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదు'

WNP: దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని, నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ అన్నారు. జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తొలిసారి డిమాండ్ చేసింది కమ్యూనిస్టులే అన్నారు. ప్రజలను సమీకరించి స్వాతంత్య్రం కోసం పోరాడిందన్నారు.