VIDEO: 'ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత'
ADB: ఆధ్యాత్మిక చింతనతోనే ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని కౌట గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప వడి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో కలిసి భజన సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.