పోగొట్టుకొన్న పర్సు బాధితురాలికి అందజేత
VZM: గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న వ్యక్తికి జిల్లా కేంద్రం కాళిఘాట్ వద్ద పర్స్ దొరికింది. వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు అందజేశారు. ఎస్సై జగదీశ్వరరావు తన సిబ్బందితో తెరిచి చూడగా, విశాఖ జిల్లా పద్మనాభంకు చెందిన తిప్పల రామాకు చెందినదిగా గుర్తించారు. వెంటనే రామాకు సమాచారం ఇచ్చి, పోగొట్టుకొన్న పర్సును అందజేశారు.