తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్

TPT: ఈనెల 24, 25, 26వ తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్-2025 పేరుతో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తిరుపతిలో బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29న జరగనున్న నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా రాష్ట్రస్థాయి పోటీలకు తిరుపతి ఆతిథ్యమిస్తుందని తెలిపారు.